ఆధ్యాత్మిక, అభ్యుదయ, ఆధునిక రచనల పుట్టినిల్లు

కవులు, రచయితలు,గ్రంధ, పద్య, గేయాల నెలవు..

మంథని మట్టినిముద్దాడిన సాహితీ తల్లి..

రచనలతో రాష్ట్ర,దేశ వ్యాప్తంగా ఖ్యాతి

మంథని ప్రాంతం ఎందరో కవులు, కళాకారులకు నిలయం. సామాజిక చైతన్యం, సమకాలిన అంశాలు, ఆధ్యాత్మికంగా, గ్రంధ, పద్య గేయాల రచనలు ఎన్నో ఇక్కడి రచయితల నుంచి జాలువారాయి. అధ్యాపకులుగా, ఉపాధ్యాయులుగా, జర్నలిస్టులుగా విధులు నిర్వహిస్తూనే పలు రచనలు చేశారు. వీరి నుంచి వెలువడిన రచనలు పలువురిని ఆలోచింపచేశాయి. సమాజంలో అణచివేత, వెట్టి చాకిరిలో మగ్గుతున్న బడుగు, బలహీన వర్గాల పక్షాన ఎర్రజెండా.. ఎర్రజెండా.. ఎన్నియల్లో పాట బహుళ ప్రాచుర్యం పొందింది. ఇక్కడి కవులు, వారు రచించిన పుస్తకాలపై ఆదివారం ప్రత్యేకం...విజ్ఞాన గనిమంత్రపురి సిరి8 ఆధ్యాత్మిక, అభ్యుదయ, ఆధునిక రచనల పుట్టినిల్లు 8 కవులు, రచయితలు, గ్రంఽథ, పద్య, గేయాల నెలవు..8 మంథని మట్టిని ముద్దాడిన సాహితీ తల్లి.. 8 రచనలతో రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ఖ్యాతి

మంథని, జనవరి 5: మంత్రపురి జలంలో.. గాలిలో.. మట్టిలోనే.. కవిత్వం పరిఢవిల్లుతోంది.. అభ్యుదయ భావా ల గనిగా.. విజ్ఞాన బండాగారంగా విరాజిల్లుతోంది. దోపిడి, వెట్టిచాకిరి విముక్తికోసం సాగిన ఉద్యమాలు మొదలుకొని అనేక సామాజిక, రాజకీయచైతన్యానికి నిలయంగా ఖ్యాతి గడించింది. మంథనికి చెందిన ఎందరో రచయితలు, కవులు, గ్రంధకర్తలు తమ రచనలను ప్రజలకు పరిచయం చేశారు.ఫ సాహితీదిగ్గజం.. గీజారేగీట్ల జనార్దన్‌రెడ్డి తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ సాహిత్యంలో రచనలు చేశారు. గీజారే తన చతురతతో రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. రాణాపూర్‌లో 1938లో జన్మించిన ఆయన స్వగ్రా మం మంథని మండలం నాగారం. అధ్యాపక వృత్తి అనం తరం రాజకీయ ప్రవేశం చేశారు. దుగ్డగీత, రక్తాశ్రుధారలు, ఆరనిమంటలు, జ్వాలా తోరణం పుస్తకాలను రచిం చారు. తెలుగు, ఆంగ్ల భాషాల్లో పలు సాహితీ ప్రక్రియలో సామాజిక, రాజకీయ అంశాలపై పద్య, గేయ రచనలు చేశారు. రేడియో, టీవీ ప్రసంగాలు, సభలు, సమ్మేళనాలు, చర్చా గోష్ఠిలో పాల్గొన్నారు. క్రాంతి, విజయ లాంటి పత్రికలకు ఎడిటర్‌గా పని చేశారు.