ప్రదానం చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్‌

కొత్తగూడెం, 12-06-2018: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ మిమిక్రీ కళాకారుడు జల్లారపు రమేష్‌కు అమెరికాలోని ఓహోయో రాష్ట్రంలోగల కొలంబస్‌ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హాస్య కళాప్రపూర్ణ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎన్‌ఆర్‌ఐలు మిమిక్రీ రమేష్‌ను కొలంబస్‌లో ఘనంగా సత్కరించారు. మిమిక్రీ ద్వారా పలువుర్ని ఆకట్టుకుంటున్న రమేష్‌ను ఎన్‌ఆర్‌ఐలు సత్కరించారు. హాస్యకళాప్రపూర్ణ బిరుదును ప్రదానం చేశారు.ఖమ్మం ఎన్‌ఆర్‌ఐ తల్లిదండ్రుల అసోసియేషన్‌ కోశాధికారి సాధినేని భాస్కర్‌రావు ఈ అవార్డును అందజేశారు. అంకం ప్రవీణ్‌, నాదేళ్ల కిషోర్‌ రమేష్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా రమేష్‌ కొలంబస్‌ నుంచి ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడారు. తనను సత్కరించి అవార్డు ప్రదానం చేసిన ఎన్‌ఆర్‌ఐ తల్లిదండ్రుల అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.