అమరావతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): అమెరికా, కెనడా దేశాల్లో తెలుగుభాషాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిని నియమించింది. అమెరికాకు చెందిన తానా పత్రిక చీఫ్‌ ఎడిటర్‌ కేసీ చేకూరిని ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ పర్యాటకశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఎలాంటి గౌరవ వేతనం లేకుండా స్వచ్ఛందంగా ఈ ప్రత్యేక ప్రతినిధి తెలుగు భాషాభివృద్ధి కోసం ఏడాది పాటు కృషి చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.