అఫ్జల్‌గంజ్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): తమ గ్రామ పరిసరాలు, బంధుమిత్రులు, కులం, మతం, చదివిన పుస్తకాలు, ఉద్యమాలు, నిరుద్యోగం, పేదరికం, చేసిన రచనలు కలిపితే తన జీవిత సమాహారం అని బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎ్‌స.రాములు అన్నారు. సోమవారం తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో 25 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రఖ్యాత కవి పండితుల పరిణతవాణి ప్రసంగ పరంపరలో బీఎ్‌స.రాములు 79వ ప్రసంగకర్తగా పాల్గొన్నారు.   తనలో చిన్నప్పటి నుంచి పరిశీలనా దృష్టి అధికంగా ఉండడం వల్ల ఆర్‌ఎ్‌సఎస్‌ పట్ల ఆకర్షితుడై ముఖ్య శిక్షక్‌ స్థానం వరకు ఎదిగి కొన్ని పరిణామాలతో విభేదించి బయటికొచ్చానన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి తదితర అంశాలపై 96 గ్రంథాలు రచించానని తెలిపారు. పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ కళ, నవలా రచయితగా బీఎ్‌స.రాములు చేసిన కృషి గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో పరిషత్తు ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.