హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల్లో సంగీతంలో శిక్షణతో పాటు, అన్నమాచార్య కీర్తనలు పాడటంలో డాక్టర్‌ శోభారాజు సమ్మర్‌ క్యాంప్‌ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు అన్నమాచార్య భావన వాహిని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14 నుంచి జూన్‌ 1 వరకు నిర్వహించనున్న శిక్షణ తరగతుల్లో పాల్గొనేవారికి జూన్‌ 1న సర్టిఫికెట్లను ఇస్తామని తెలిపారు. ఆసక్తిగల వారు తమ పేర్లను 040-23112299 నంబర్‌కు ఫోన్‌ చేసి నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు.రిజిస్టర్‌ చేసుకున్న వారికి డాక్టర్‌ శోభారాజు మే 14వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారన్నారు.