చిక్కడపల్లి, సెప్టెంబర్‌30(ఆంధ్రజ్యోతి): సమాజాన్ని చదివినప్పుడు కవులు ఉత్తమ కవిత్వాన్ని రాయగలరని  ప్రముఖ కవి గోరటి వెంకన్న అన్నారు. విమల సాహితీ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి త్యాగరాయగానసభలో బొజ్జాతారకం, మైడి తెరే్‌షబాబు సంస్మరణ సభ, బొజ్జాతారకం నీలిజెండా సంపాదకీయాలు, డా. జీవీ రత్నాకర్‌ రచించిన ముసిబాస దీర్ఘకావ్యం ఆవిష్కరణ సభ జరిగింది.ఈసందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న గోరటి వెంకన్న మాట్లాడుతూ ప్రజలతో భాగస్వామ్యమైప్పుడే సమాజాన్ని ప్రభావితం చేసే కవిత్వం వస్తుందని అన్నారు. కవులు ప్రేమతో ఉంటూనే ఆధిపత్యాన్ని ధిక్కరించాలన్నారు.  బొజ్జాతారకం, బాలగోపాల్‌ అనంతరం ప్రశ్నించేవారే లేకుండా పోయారన్నారు. పైడి తెరే్‌షబాబు నిజాయితీ కలిగిన కవి అన్నారు. సాహితీవేత్త కె శివారెడ్డి మాట్లాడుతూ కవులు నిత్యవిద్యార్థులుగా ఉండాలన్నారు. మధ్యాహ్నంనుంచి సాయంత్రం వరకు జరిగిన తొలి సభకు బత్తుల పున్నయ్య అధ్యక్షత వహించగా, బోయి నాగవర్మ, బైసా దేవదాసు, యలవర్తి రాజేంద్రప్రసాద్‌, జెల్ది విద్యాధరరావు, డా.జీవీ రత్నాకర్‌, కొమ్మునరేందర్‌, పాల్గొన్నారు. రెండోసెషన్‌లో శివారెడ్డితోపాటు రమణ వెలమకన్ని, కళా జనార్దనమూర్తి, కోయి కోటేశ్వరరావు, దెంచనాల శ్రీనివాస్‌, డా.దార్ల వెంకటేశ్వరరావు, పెద్దూరి వెంకటదాసు, రఘువీర్‌ ప్రతా్‌పతదితరులు పాల్గొన్నారు.