ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలి

మాతృ దినోత్సవంలో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు

చిక్కడపల్లి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు అన్నారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి త్యాగరాయగానసభలో మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ పూర్వ సభ్యురాలు లక్ష్మీదేవి స్మారకార్థం వివిధ రంగాలకు చెందిన వారికి లక్ష్మీదేవి పురస్కారాలను ప్రదానం చేశారు. మాతృదేవోభవ సత్సంగ్‌ అధినేత కేబీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని అవార్డులను ప్రదానం చేసి అభినందించారు. సీనియర్‌ పాత్రికేయురాలు జ్యోతిర్మయి, సంఘసేవకురాలు కళ్యాణి, వి లలిత, మాజీ కార్పొరేటర్‌ ఇందిర, ధనలక్ష్మి పట్నాయక్‌, వాహిని తదితరులకు లక్ష్మీదేవి అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నేత జి.చిన్నారెడ్డి, ప్రముఖ సంఘసేవకులు జి.శ్రీధర్‌రెడ్డి, జి మహేందర్‌రెడ్డి, గడ్డం లక్ష్మి, మాతృదేవోభవ సత్సంగ్‌ సలహాదారు కేబీ అరుణ, అంతర్జాతీయ సాయి సేవా సమాజ్‌ అధ్యక్షుడు కె సుధాకర్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ గాలి వినోద్‌కుమార్‌, సంఘసేవకులు పవన్‌కుమార్‌, టీపీసీసీ కార్యదర్శి కె రవిగౌడ్‌ పాల్గొన్నారు.