హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): బందారంలో వికసించిన మందారం నందిని సిధారెడ్డి.. తెలంగాణ రైతు భాషను సాహిత్యం లో కి తెచ్చిన గొప్ప సాహితీవేత్త అని పలువురు వక్తలు కొనియాడారు. బుధవారం రవీంద్రభారతిలో తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడిగా డాక్టర్‌ నందిని సిధారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సాహితీవేత్తలు, కవులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో రచయితలు కీలకపాత్ర  పోషించారన్నారు. ఆయన రాసిన నాగేటి చాలల్ల అనే పాట ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిం దన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ దేశంలోనే ఆదర్శంగా నిలవా లని ఆకాంక్షించారు. సిద్ధిపేట జిల్లా మందారంలో సిధారెడ్డి జన్మించా రు. తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా కొత్తతరం కవులను, రచయి తలను ప్రోత్సహిస్తామని సిధారెడ్డి చెప్పారు. తెలంగాణ సాహిత్య అకాడమీని ఏర్పాటు చేయాలన్నది తన చిరకాల స్వప్నమని, కేసీఆర్‌ వంటి సాహితీవేత్త రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడంతో సాకారమైం దన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్యెల్యేలు రసమయి బాలకిషన్‌, రామ లింగారెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, దేశపతి శ్రీనివాస్‌, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌, బీసీ కమిషన్‌ చైర్మన్‌ రాములు తదితరులు పాల్గొన్నారు.