రవీంద్రభారతి, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): పాలపిట్ట బుక్స్‌, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గొట్టిపర్తి యాదగిరిరావు రచించిన నిశ్శబ్ద యుద్ధం పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సోమవారం రవీంద్రభారతి మినీ హాల్‌లో జరిగిన ఆవిష్కరణ కార్యక్ర మంలో ముఖ్య అతిథిగా తెలంగాణ జనవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వి.ప్రకా్‌షరావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ డా.నందిని సిధారెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పాలకుర్తి మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచయిత గొట్టిపర్తి యాదగిరిరావును సత్కరించి అభినందించారు. ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతపట్ల సుదర్శన్‌, ఎం.నారాయణశర్మ తదితరులు పాల్గొన్నారు.