రవీంద్రభారతి, సెప్టెంబర్‌ 10(ఆంధ్రజ్యోతి): నగరానికి చెందిన నృత్య గురువు నల్లా రమాదేవిని నేషనల్‌ నృత్య భూషణ్‌ అవార్డుతో ఉత్కల్‌ యువ సాంస్కృతిక్‌ సంఘ్‌ సత్కరించింది. వారం రోజులుగా ఒడిశాలో జరిగిన నృత్యోత్సవంలో రమాదేవి బృందం పాల్గొంది. శ్రీవరిపాదులు శీర్షికన భరతనాట్య ప్రదర్శన చేసిన రమాదేవి బృందం అక్కడి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. దీనికి గాను ఆమెను నేషనల్‌ నృత్య భూషణ్‌ అవార్డుతో సత్కరించారు.