హైదరాబాద్, పంజాగుట్ట: విదేశాలకు వెళ్ళి వలస జీవితంలో ఉండే వేదనను వ్యక్తీకరించి కాసుల రవికిరణ్‌ రాసిన ఓసియానిక్‌ సెయిల్‌ పోయెట్రి పుస్తకావిష్కరణ ఆదివారం సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ లో జరిగింది. పుస్తకాన్ని రవికిరణ్‌ తల్లి సరస్వతి కాసుల ఆవిష్కరిం చారు. మంచి పోయెట్రి పుస్తకం రాశారని ఆయనకు మంచి భవిష్య త్తు ఉందని పలువురు వక్తలు అన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ పా త్రికేయులు కాసుల ప్రతాప్‌రెడ్డి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారా యణ, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌, మాజీ ఉపకులపతి ఆ చార్య ఎన్‌.గోపి, ప్రముఖ దర్శకులు బి.నర్సింగరావు, ప్రొఫెసర్‌ సుమతి నరేంద్ర, రచయిత్రి ముదుగంటి సుజాతరెడ్డి, కవి, రచయిత సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.