రవీంద్రభారతి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ప్రతిభను గుర్తించి పట్టం కట్డడం అభినందనీయమని ఢిల్లీతో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి ఎస్‌.వేణుగోపాలచారి అన్నారు. ఆదివారం తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో సృజన ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన పలువురికి ఈ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వేణుగోపాలచారి పురస్కార గ్రహీతలను సత్కరించి మాట్లాడారు. బీసీ కమిషన్‌ సభ్యుడు వకుళాభరణం కృ ష్ణమోహన్‌ మాట్లాడుతూ సృజన ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తారని ప్రశంసించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు రాజే్‌షతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.