ఉప్పల్‌,హైదరాబాద్: సాహిత్య ప్రపంచానికి ఎనలేని సేవలు అందిస్తూ తెలుగు, సంస్కృతం భాషల అభివృద్ధికి రాళ్లబండి చంద్రశేఖరశాస్త్రి చేస్తున్న కృషి ఎంతో గొప్పదని మాజీ డీజీపీ అరవిందరావు పేర్కొన్నారు. బుధవారం హబ్సిగూడలో రాళ్లబండి 75వ జన్మదినోత్స వానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాహితీ ప్రియులు, పండితులు, కవులు, ఇతర ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు. అనంతరం చంద్రశేఖరశాస్త్రి రచించిన ‘రాళ్లబండి వంశంవారి జాతకాలు’, ‘మాకథ’ పుస్తకాలను మాజీ డీజీపీ అరవింద్‌రావు, ఇతర ప్రముఖులు ఆవిష్కరించారు. పండితులు పోరంకి దక్షిణామూర్తి, శలాక రఘునాథ శర్మ, మలుకుంట్ల బ్రహ్మానందశాస్త్రి తదితరులు.. రాళ్లబండిని సన్మానించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని వనస్థలి పురంలోని గ్రేస్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ అనాథాశ్రమా నికి ఆర్థిక సహాయాన్ని అందజేసినట్టు రాళ్లబండి సునీల్‌, ప్రియాంక తెలిపారు.