సీమ చరిత్రను, భాషను, యాసను, సాహిత్యాన్ని కాపాడుకునేందుకు ‘రాయలసీమ తెలుగు మహాసభలు-2018’ నిర్వహణ కోసం ఓ సలహా సంఘం ఏర్పాటయింది. తరతరాలుగా రాయలసీమ వారిని రౌడీలుగా, గూండాలుగా, మానవత్వం లేనివారిగా చూపుతూ, సీమ యాసను, భాషను తక్కువ చేసి చూపుతున్నారనీ, దీనికి చరమగీతం పాడేందుకు సీమ బిడ్డలు ముందుకురావాలని సలహా సంఘం నాయకులు పిలుపునిచ్చారు. యాసను, భాషను, మాండలికాలను, సామెతలను, జాతియాలను, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకున్న వారే.. చరిత్రలో విజయం సాధించిన దాఖలాలు ఉన్నాయనీ, ఇప్పుడు రాయలసీమ పౌరుల ముందు భారీ సంకల్పం ఉందన్నారు. రాయలసీమ తెలుగు మహాసభల్లో పాల్గొని రాయలసీమ యాస, భాష, సాహిత్యం గురించి ప్రపంచానికి చాటి చెప్పాలని సూచించారు. ‘తెలుగు గుండె నిండుగ సీమ సాహిత్య పండుగ.. సీమ సాహిత్యాన్ని వెలుగులోకి తెద్దాం, తెలుగు వెలుగులు ప్రపంచానికి పంచుదాం.. రాయలసీమ ఖ్యాతిని దశదిశలా చాటుదాం’ అనే నినాదాలతో రాయలసీమ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నామని రాయలసీమ తెలుగు మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు కుంచం వెంకట సుబ్బారెడ్డి వివరించారు. 


కుంచం వెంకటసుబ్బారెడ్డి ==== రాయల సీమ తెలుగు మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు
సలహా సంఘం
డాక్టర్ కేతు విశ్వనాథ రెడ్డి
వై. ప్రభాకర్ రెడ్డి

మూలే మల్లికార్జునరెడ్డి

కటికరెడ్డి రామాంజులరెడ్డి

కట్టా నరసింహులు
సి. శైల కుమార్
గంగవరం శ్రీదేవి
బి.ఎస్‌.వి. నాగిరెడ్డి
కాటూరి ప్రసాదరావు