ఆహ్వానిస్తున్న తెలుగు వర్సిటీ

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): సాహితీ పురస్కారాల-2018 ఎంపికకు సూచనలు అందజేయాలని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ గురువారం కోరింది. వివిధ ప్రక్రియల్లో ఉత్తమ రచనలను ప్రోత్సహించడానికి ఈ పురస్కారాలు ఇస్తున్నారు. వీటి ఎంపికను ప్రజల నుంచి వచ్చే సూచనల ఆధారంగానే నిర్ణయిస్తారు. 2015 జనవరి నుంచి 2017 డిసెంబర్‌ మధ్యకాలంలో తొలిసారిగా ప్రచురణ పొందిన పుస్తకాలను సూచించవచ్చు. ఆ వివరాలను ఈ నెల 30వ తేదీలోగా.. వర్సిటీకి తెలియజేయవచ్చు.