హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు2 (ఆంధ్రజ్యోతి): సమాజంలో ఆంగ్లభాషా వ్యామోహం పెరిగి, ఇంగ్లీ షు చదువుతోనే ఉన్నతస్థాయికి చేరుకుంటామనే భావన పెరిగిపోతోందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను ఆంగ్లంతో అనుసంధానం చేయడమే అందుకు కారణమన్నారు. బుధవారం శాంతా వసంత ట్రస్టు, విశ్వనాథ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో ‘‘గీతాంజలి, వేయిపడగలు, అమృ తం కురిసిన రాత్రి రచనల అనువాదాలు-సమస్యలు’’ అంశంపై నిర్వహించి న సదస్సు ముగింపు సభకు ఆయన హాజరై మాట్లాడారు. అంతకుముందు ‘వేయిపడగలు’కు ఆంగ్ల అనువాదంగా వెలువడిన ‘థౌజండ్‌ హుడ్స్‌’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. విశ్వనాథ సాహిత పురస్కారాన్ని సాహితీ విమర్శకురాలు, రచయిత్రి సి.మృణాళినికి, వెల్చాల కేశవరావు స్మారక పురస్కారాన్ని కవయిత్రి వైదేహీ శశిధర్‌కు ప్రదానం చేశారు. శాంత బయోటెక్‌ చైర్మన్‌ కె.ఐ.వరప్రసాదరెడ్డి, విశ్వనాథ సాహిత్య పీఠం చైర్మన్‌ వెల్చాల కొండలరావు పాల్గొన్నారు.