చిక్కడపల్లి, మే10(ఆంధ్రజ్యోతి): సాహితీసేవ చేస్తున్నవారిని గౌరవించుకోవాలని వక్తలు అన్నారు. శ్రీ మానస ఆర్ట్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి త్యాగరాయ గానసభలో శ్రీలక్ష్మి చివుకుల రచించిన ఆది నుంచి .... అనంతం దాకా..... గ్రంథావిష్కరణ సభ జరిగింది. ఈసందర్భంగా పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అ కాడమి ఛైర్మన్‌ ప్రొ. కొలకలూరి ఇనాక్‌ ఆవిష్కరించారు. ప్రముఖ సాహితీవేత్త డా. కసిరెడ్డి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో ప్రముఖ సాహితీవేత్త చిమ్మపూడి శ్రీరామమూర్తి, కవి రఘుశ్రీ తదితరులు ప్రసంగించారు. సాహిత్య రచనలు చేస్తూ సమాజంలో ఆశించదగ్గ మంచి మార్పులు రావడానికి కృషి చేస్తున్న వారు తక్కువగా ఉంటారని అలాంటివారిని అభినందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బండారుపల్లి రామచంద్రరావు, డా. లలితవాణి తదితరులు పాల్గొన్నారు.