ఆబిడ్స్‌, నవంబర్‌ 4 (ఆంధ్రజ్యోతి): సుప్రసిద్ధ ర చయిత , శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయానికి ఐదు దశాబ్దాల పాటు కార్యదర్శిగా ఉండి విశిష్టమైన సేవలు అందించిన ఎంఎల్‌ నరసింహారావు పేరిట ఏర్పాటు చేసిన సాహితీ పురస్కారాన్ని డాక్టర్‌ ఆర్‌ మాధవరావు ప్రదానం చేశారు. ఆదివారం రాత్రి సుల్తాన్‌బజార్‌లోని శ్రీ కృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయంలో రావిచెట్టు రంగారావు సభా మందిరంలో డాక్టర్‌ ఎంఎల్‌ నరసింహారావు  జయంతిని నిర్వహించారు. ఈ   కార్యక్ర మానికి ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ రమణాచారి ముఖ్య అతిథిగా విచ్చేసి అవార్డుతో పాటు రూ 10,116 నగదు పురస్కారాన్ని డాక్టర్‌ మాధవరావుకు అందజేశారు. అనంతరం రమణాచారి ప్రసంగిస్తూ ఎంఎల్‌ నరసింహారావు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో  శ్రీ కృష్ణ దేవరాయ తెలుగు భాషానిలయం అధ్యక్షుడు నూతి శంకర్‌రావు, గౌరవ కార్యదర్శి టి. ఉడయవర్లు , అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.