26 నుంచి 28 వరకూ పుస్తకప్రదర్శన : బుర్రా వెంకటేశం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సమస్త కళలకు కేంద్రబిందువుగా నిలవనుందని సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ హైదరాబాద్‌ సాహితీ ట్రస్ట్‌ సంయుక్తంగా ఈనెల 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో పుస్తక పండుగ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ అంశంపై మంగళవారం సచివాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది స్పానిష్‌ భాషా రచనలు, కర్ణాటక ప్రముఖ రచయితలు, రచయిత్రులు పాల్గొంటారని తెలిపారు.