08-08-2018: బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ భార్య, నటి ట్వింకిల్ ఖన్నా రచించిన మూడో పుస్తకం ‘పైజమాస్ ఆర్ ఫర్‌గివ్వింగ్’ అమెజాన్‌లో మూడో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. పబ్లిషర్ జగ్గెర్నాట్ బుక్స్ ఈ బుక్‌ను బెస్ట్ సెల్లర్ లిస్టులో చోటు సంపాదించుకున్నట్లు ప్రకటించింది. 43 ఏళ్ల ట్వింకిల్ దీని గురించి మాట్లాడుతూ నంబర్ 3 తనకు ఎంతో లక్కీ అని పేర్కొన్నారు. ఎడిటర్ చికీ సర్కార్‌తో పాటు ఆమె సాగించిన మూడవ రచన ఇది. ట్వింకిల్ యాక్టింగ్‌ను దాదాపు విడిచిపెట్టేశారు. ఆమె చివరిసారిగా అక్షయ్ సినిమా ‘తీస్ మార్ ఖా’లో గెస్ట్ రోల్‌లో కనిపించారు. కాగా గత ఏడాది సెప్టెంబరు తొలివారంలో విడుదలైన ఈ పుస్తకం ఇంతగా ఆదరణ పొందడం అమితమైన ఆనందాన్నిస్తోందని ట్వింకిల్ పేర్కొన్నారు. కాగా ట్వింకిల్ అంతకుముందు రాసిన ‘ఫనీబెన్స్ ఔర్ దీ లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్’ పుస్తకం కూడా ఎంతో ఆదరణ పొందింది. దీని ఆధారంగా రూపొందించిన ‘ప్యాడ్‌మ్యాన్’లో అక్షయ్ లీడ్ రోల్ పోషించారు. కాగా ట్వింకిల్ ఖన్నా... హీరో వెంకటేష్ సరసన ‘శీను’ చిత్రంలో నటించారు.