చిక్కడపల్లి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సేవా భారతి పురస్కారాల ప్రదాన సభ శిఖరం ఆర్ట్స్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం త్యాగరాయ గానసభలో జరిగింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రముఖులైన వై.రవిచంద్రబాబు, ఫణికుమార్‌శర్మ-అనురాధ, జగన్‌ నాయక్‌ విస్లావత్‌, రంజు ప్రవీణ, ఎం.రంజనిలకు పురస్కారాలను మాజీ సీఎం డాక్టర్‌ కొణిజేటి రోశయ్య అందజేశారు. ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా పురస్కారాలు అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీవీ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు మహ్మద్‌ షరీఫ్‌, కవి శ్రీనివాస్‌, సంఘసేవకురాలు కృష్ణవేణి, రాజేంద్రప్రసాద్‌, నాగభూషణం, జి.కృష్ణ పాల్గొన్నారు.