చెన్నై, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఏపీలోని విశాఖపట్నానికి చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు పంతుల రమకు శుక్రవారం చెన్నైలో ప్రతిష్ఠాత్మక ఇందిర శివశైలం ధర్మనిధి పతకాన్ని ప్రదా నం చేశారు. చెన్నైలోని మ్యూజిక్‌ అకాడమీతో కలిసి విశిష్ట సంగీత కళాకారులకు ఏటా ధర్మనిధి పతకాన్ని ప్రదానం చేస్తున్నారు.