కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలి సంచాలకుడు శివారెడ్డి

తిరుపతి (విశ్వవిద్యాలయాలు) జూలై 6: సమాజంలో మహిళల ఉన్నతికి సాహిత్యం తోడ్పడాలని ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సంచాలకుడు కె.శివారెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో శుక్రవారం ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల రచయిత్రుల సదస్సు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో శివారెడ్డి ప్రసంగించారు. తెలుగులో చలం ఎంతో గొప్ప స్త్రీవాద సాహిత్యాన్ని సృష్టించారని తెలిపారు. సమాజ పరిణామంలోని ప్రతి దశలో స్త్రీ ప్రమేయం ఉందన్నారు. అందుకే ప్రతి పురుషుడి అభివృద్ధి వెనుకా ఒక స్త్రీ ఉంటుందనే నానుడి స్థిరపడిందన్నారు. నలుగురు మనుషుల కలయికే గొప్ప కవిత్వమన్నారు.