అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఆత్మీయ సత్కారం

విజయవాడ, అవనిగడ్డ: కళాతపస్వి, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ దర్శకుడు డా.కె.విశ్వనాథ్‌కు కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో 1200 మంది విద్యార్థులు నృత్య నీరాజనం సమర్పించారు. తాను తీసిన సినిమాలోని పాటలకు తన కళ్లెదుట విద్యార్థులు నర్తిస్తుంటే విశ్వనాథ్‌ తన్మయత్వానికి లోనయ్యారు. 1200 మంది విద్యార్థులు ప్రదర్శించిన నృత్యనీరాజనం తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదైంది. అనంతరం మండలి బుద్ధప్రసాద్‌ దంపతులు, ఎంపీ కొనకళ్ల విశ్వనాథ్‌ను ఘనంగా సత్కరించారు.