రవీంద్రభారతి, హైదరాబాద్, జూలై 4(ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత, కవిచంద్ర నర్సింగోజు లక్ష్మయ్య రచించిన ‘శ్రీ వేంకటేశ పద్య శతకము’ పుస్తకాన్ని బుధవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆవిష్కరించారు. అస్థిత్వం సంస్థ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా సాహితీవేత్తలు పిల్లలమర్రి రాములు, తిరునగరి, వేణుగోపాల స్వామి, కృష్ణచైతన్య, నసీమాబేగం, నాగులవంచ కవిత తదితరులు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించి రచయితను అభినందించారు. ఈ సందర్భంగా రాములు, తిరునగరి మాట్లాడుతూ ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. నర్సింగోజు లక్ష్మయ్య చక్కటి రచన చేశారని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.