నర్తకి వనజాఉదయ్‌కి నృత్యకిరణం బిరుదు ప్రదానం 
హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: సుమారు 250మంది కళాకారులు ఒకే వేదికపై నర్తించి భళా అనిపించారు. గురువారం రవీంద్ర భారతిలో వేదిక స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో నృత్యసమ్మేళనం శీర్షికన నృత్య ప్రదర్శన జరిగింది. ఈ సంద ర్భంగా వివిధ నృత్య కళాశాల లకు చెందిన కళాకారులు నృత్య ప్రదర్శ నలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా ప్రఖ్యా త నృత్యకారిణి డాక్టర్‌ వనజా ఉదయ్‌ 35ఏళ్ల నాట్యజీవితాన్ని పురస్క రించుకుని ఆమెను ఘనంగా సత్కరిం చారు. ఈ సందర్భంగా నృత్యకిరణం బిరుదుతో సన్మానించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా ఐఏఎస్‌ దినకర్‌బాబు, కమలాకర్‌ శర్మ, సివిఎల్‌ నర్సింహారావు, ఆచార్య చక్రవర్తి తదితరులు హాజరై వనజాఉదయ్‌ను అభినందించారు.