గుంటూరు, 14-06-2019 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జూలై 4 నుంచి 6 వరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలు నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ సభల్లో అందరినీ భాగస్వాములను చేసేందుకు, అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మహాసభల నిర్వహణకు సభ్యులు, అభిమానులు, తెలుగు ప్రముఖులు విరాళాలను అందజేయాలని సతీష్‌ వేమన కోరారు.