పుస్తకావిష్కరణ సభలో ముదిగంటి సుజాతారెడ్డి
రవీంద్రభారతి, అక్టోబర్‌8 (ఆంధ్రజ్యో తి): సామాజిక, స్ర్తీవాద రచనలు చేసిన తొలితరం తెలంగాణ రచయిత్రి నందగిరి ఇందిరాదేవి అని ప్రముఖ రచయిత్రి ముదిగంటి సుజాతారెడ్డి అన్నారు. నందగిరి ఇందిరాదేవి శతజయంతి సందర్భంగా ఆమె కథలు వెలుగులోకి రావడం సంతోషకరమన్నారు. రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో తెలంగాణ సాహిత్య అకాడ మీ ఆధ్వర్యంలో డాక్టర్‌ చీదెళ్ల సీతాలక్ష్మి, పరిమి వెంకట సత్యమూర్తి సంపాదకత్వంలో నందగిరి ఇందిరాదేవి కథలు పుస్తకావిష్కరణ సభ సోమవారం జరిగింది. ఈ సభకు తెలంగాణ సాహి త్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అధ్యక్షత వహించగా ముదిగంటి సుజాతారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. సుజాతారెడ్డి మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న తొలి మహిళ ఇందిరాదేవి అన్నారు. ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకుల్లో ఒకరని తెలిపారు. సాంఘిక సంస్కరణోద్యమ సారథిగా ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. నందిని సిధారెడ్డి మా ట్లాడుతూ తెలంగాణకు గర్వించదగిన గతం ఉందన్నారు. సాహిత్య అకాడమీ చరిత్రను పున ర్నిర్మించుకునే ప్రతయ్నం చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఆచార్య వడ్లకొండ స్వరాజ్యలక్ష్మి, నందగిరి వీర, డాక్టర్‌ గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి తదితరులు పాల్గొన్నారు.