11-02-2018: ప్రతి ఎమ్మెల్యే ఏడాదికి ఒక్కసారైనా.. నియోజకవర్గంలో భాషా సదస్సు నిర్వహించాలిసుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణతెలుగుభాషా బ్రహ్మోత్సవాలు ప్రారంభంఘనంగా శ్రీకృష్ణదేవరాయ మహోత్సవంఏపీ సృజన్మాతకత.. సంస్కృతి సమితి, పర్యాటక శాఖ, దేవదాయ శాఖ, దివి ఐతిహాసిక మండలి ఆధ్వర్యంలో ఉపసభాపతి మండలి పర్యవేక్షణలో శ్రీకృష్ణదేవరాయ మహోత్సవం-2018, తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు ఉత్సవాలను ప్రారంభించారు. ఆంధ్రుల తొలి రాజధానిగా భాసిల్లిన శ్రీకాకుళంలో కొలువైన ఆంధ్ర మహావిష్ణువును జస్టిస్‌ ఎన్వీ రమణ దర్శించుకుని పూజలు చేశారు. ఆముక్తమాల్యద మండపంలోని శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా దేశభాషలందు తెలుగులెస్స పరిశోధనాత్మక వ్యాస సంపుటితోపాటు 7 గ్రంఽథాలను ఆవిష్కరించారు. రెండు రోజులపాటు జరుగనున్న తెలుగు భాషా బ్రహ్మోత్సవాల్లో భాషాభివృద్ధికి పలు సదస్సులు నిర్వహించనున్నారు.