చిక్కడపల్లి, సెప్టెంబర్‌14(ఆంధ్రజ్యోతి):  సైంటిస్ట్‌లు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, జేన్‌ గుదాల్‌, న్యూటన్‌  జీవిత చరిత్రల ఆధారంగా కేబీ గోపాలన్‌ రచించిన కొత్తదారులు -1, కొత్తదారులు-2, కొత్తదారులు-3 పుస్తకాల ఆవిష్కరణ సభ శుక్రవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌజ్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈ పుస్తకాలను ప్రముఖ విద్యావేత్త డా,. చుక్కా రామయ్య ఆవిష్కరించారు. రచయిత గోపాలం, జనవిజ్ఞానవేదిక నేత ప్రొ. ఆదినారాయణ, సీనియర్‌ పాత్రికేయుడు పాశం యాదగిరి, తెలంగాణ ప్రజా సాంస్కృతిక  కేంద్రం కార్యదర్శి హిమబిందు తదితరులు  ప్రసంగించారు. ఈ మూడు పుస్తకాలు చిన్నవైనా విజ్ఞానదాయక అంశాల్ని అందించాయన్నారు.  ఈ సందర్భంగా రచయిత గోపాలన్‌ను సన్మానించారు.