మంగపేట, జయశంక ర్‌ భూపాలపల్లి జిల్లా(వరంగల్): మండల కేంద్రంలోని గంపోనిగూడానికి చెందిన ప్రముఖ నవలా రచయిత, సీనియర్‌ జర్నలిస్ట్‌ కొనకంచి లక్ష్మీనరసింహారావు (55) మంగళవారం రాత్రి సూర్యాపేట జిల్లా మోత్కురులో గుండెపోటుతో మృతి చెందారు. గంపోనిగూడానికి చెందిన లక్ష్మీనరసింహారావు సతీమణి ఎల్లాప్రగడ వెంకటఝాన్సీలక్ష్మి ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌గా మంగపేటలో విధు లు నిర్వర్తించారు. జిల్లాల విభజన తర్వాత పదోన్నతిపై సూర్యాపేట జిల్లా మోత్కురుకు ఆమె బదిలీపై వెళ్లారు. మంగళవారం సతీమణిని ద్విచక్రవాహనంపై ఇంటికి తీసుకువచ్చిన లక్ష్మీనరసింహారావు కొద్దిసేపటికే అలసటగా ఉందని కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన మంగపేటకు బుధవా రం రాత్రి బంధువులు తరలించారు. కొనకంచి 1990 సంవత్సరం నుంచి అనేక నవలలు రచించి పలువురి మన్ననలు పొందారు. పలు దినపత్రికలలో పాత్రికేయుడిగా పని చేశారు. మంత్రలిపి, నేనేమి మాట్లాడను వంటి పలు నవలలను రచించి ప్రశంసలు పొందారు. లక్ష్మీనరసింహారావుకు భార్య, కుమారులు శ్రీకాంత్‌, సతీ్‌షకుమార్‌, అజయ్‌కుమార్‌లు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం నిర్వహించేందుకు బంధువులు సన్నాహాలు చేస్తున్నారు.