చిక్కడపల్లి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా జన్మదినం సందర్భంగా నిర్వహించిన సినీ సంగీత విభావరి ఆకట్టుకుంది. శ్రీ రాగవిరాజిత సంస్థ ఆధ్వర్యంలో గురువారం రాత్రి త్యాగరాయగానసభలో ఇళయరాజా స్వరపరచిన మధుర     గీతాల ఆలాపన కార్యక్రమం జరిగింది. సంస్థ నిర్వాహకురాలు, గాయనీ సీవీఎ్‌సఆర్‌ఎల్‌ రాధిక నిర్వహణలో విజయ, నాగమణి, హరివిమల, రామలక్ష్మి, చంద్రజ్యోతి, ఉషారాణి, శారద, నాగరాజు, రమణ, నందగోపాల్‌, శ్రీధర్‌, వెంకటేష్‌, సత్యనారాయణ, శర్మ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా అతిథులు సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి మాట్లాడుతూ ఇళయరాజా దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడన్నారు.