చిక్కడపల్లి, జూలై10(ఆంధ్రజ్యోతి): ప్రతి నెలా  హరికథా ఉత్సవాలను త్యాగరాయగానసభ  నిర్వహించడం అభినందనీయమని మల్కాజ్‌గిరి కోర్టు న్యాయమూర్తి బూర్గుల మధుసూదన్‌ అన్నారు. బుధవారం త్యాగరాయగానసభలో గానసభ ఆధ్వర్యంలో హరికథా కళాకారిణి ఆర్‌ లక్ష్మి  యోగి వేమన అంశంపై హరికథాగానం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొని లక్ష్మిని సన్మానించిన మధుసూదన్‌ మాట్లాడుతూ ప్రాచీనకళలను ప్రోత్సహించడం  అభినందనీయమన్నారు. హరికథలో నటన, నాట్యం, సాహిత్యం కలగలిసి ఉంటాయని ఇది సర్వకళలసమాహారం అన్నారు.ఈ కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, ప్రముఖ సాహితీవేత్త డా. ముక్తేవి  భారతి, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్రప్రసాద్‌, రచయిత నోరి సుబ్రహ్మణ్యం  పాల్గొన్నారు.