రవీంద్రభారతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): హృదయాన్ని  కదిలించగలిగిందే కవిత్వమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. సోమవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆనుసూరి వెంకటేశ్వరరావు రచించిన ‘నేనుసైతం’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నందిని సిధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి కవిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను సైతం పుస్తకంలో చెరువు, పల్లె విలువలను తెలియజేస్తూ మంచి కవితలు ఉన్నాయన్నారు. ఈతరం పిల్లలకు పల్లె గురించి తెలియాలన్నారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి, బి.నాగేంద్రబాబు, మేక రవీంద్ర, గోగెలపాటి కృష్ణమోహన్‌, దాసోజు పద్మావతి, రమాదేవి కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.