విజయవాడ, 05-10-2018: డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ 2018కి అవార్డు గ్రహీతల జాబితాను గురువారం విజయవాడలో ప్రకటించింది. బాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ విశిష్ట పురస్కారాన్ని, డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రెడ్డి, కథల రచయిత చొక్కపు వెంకట రమణలకు విశేష పురస్కారాలు అందిస్తున్నామని తెలిపారు. ఫౌండేషన్‌ చైర్మన్‌ రామినేని ధర్మప్రచారక్‌, గుంటూరు జడ్పీ మాజీ చైర్మన్‌ పాతూరి నాగభూషణం ఈ వివరాలను వెల్లడించారు. మంగళగిరిలో ఈ నెల 7వ తేదీన అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు.