చిక్కడపల్లి, ఫిబ్రవరి13(ఆంధ్రజ్యోతి): ఘంటసాల గానం చిరస్మణీయమని ఎస్‌బీఐ మాజీ ఏజీఎం, ప్రముఖ గాయకుడు చింతలపూడి త్రినాథరావు అన్నారు. అర్చన కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి త్యాగరాయగానసభలో అమరగాయకుడు ఘంటసాల వర్ధంతి సందర్భంగా ఘంటసాల పురస్కార ప్రదానసభ జరిగింది.ఈ సందర్భంగా త్రినాథరావు ఏలూరుకు చెందిన గాయని  రేవతి రామ్‌కుమార్‌ దంపతులను సత్కరించి ఘంటసాల పురస్కారాన్నిప్రదానం చేశారు. అనంతరం త్రినాథరావు  మాట్లాడుతూ ఘంటసాల గానం ఆపాతమధురం అన్నారు. ఆయన గానానికి అందరూ ఆకర్షితులవుతారన్నారు. ఘంటసాల పురస్కార ప్రదాన సభ నిర్వహించి ఆ అమరగాయకుడిని మరోసారి తల్చుకునే అవకాశం కల్పించిన నిర్వాహకుడు అర్చన వెంకటేశ్వరరావును ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వీ రామారావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల సినీ సంగీత విభావరిని నిర్వహించారు. అఖిల, జయశ్రీ, మనస్విని, పద్మప్రియ, రాధిక, లలిత, కళ్ళేపల్లి మోహన్‌, లలిత, టీవీరావు, శివకుమార్‌, శ్రీనివాసశర్మ, శేఖరుడు, మారుతిరామ్‌, శేఖర్‌లు గీతాలు ఆలపించారు.