చిక్కడపల్లి, అక్టోబర్‌8 (ఆంధ్రజ్యోతి): తెలుగు సాహిత్యంలో మరిచి పోలేని రచయిత అడవి బాపిరాజు అని తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యుడు జూలూరు గౌరీశంకర్‌ అన్నారు. త్యాగరాయగానసభ, వైఎస్‌ఆర్‌ మూర్తి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి త్యాగరాయగాన సభలో ప్రముఖ చిత్రకారుడు, రచయిత అడవి బాపిరాజు జయంతి సభ జరిగింది. గౌరీశంకర్‌  మాట్లాడుతూ అత్యంత అద్భుతమైన సౌందర్యాత్మక రచనలు చేసిన కవి, రచయిత, చిత్రకారుడు బాపిరాజు అన్నారు. ఆయన రాసిన రచనలు తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం ఉంటాయన్నారు. కాకతీయ రాజ్యానికి వెన్నెముకగా నిలిచిన గోన గన్నారెడ్డి చరిత్రను ప్రధానపాత్ర చేసి అడవి బాపిరాజు అద్భుతమైన నవలను రాశారన్నారు. ఆయన గీసిన ధ న్వంతరి చెరకుడు చిత్రాలు వివేష ప్రాధాన్యాన్ని పొందాయన్నారు. విశ్వక ళాపరిషత్‌ విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగల నవలకు, అడవి బాపిరా జు నారాయణరావు నవలకు ఒకేసారి అవార్డులు ఇచ్చి సత్కరించిందన్నా రు. సమావేశంలో వంశీ సంస్థల అధినేత డా.వంశీ రామరాజు, రచ యిత్రి తెన్నేటి సుధాదేవి, గానసభ కమిటీ సభ్యులు బండి శ్రీనివాస్‌, వైఎస్‌ఆర్‌ మూర్తి ట్రస్ట్‌ అధినేత వైఎస్‌ఆర్‌మూర్తి, గాయని శారద పాల్గొన్నారు.