రచయిత జయధీర్‌ తిరుమలరావు

ప్రభుత్వానివి ఒంటెద్దు పోకడలు: అందెశ్రీ

జాతరలా తెలుగు సభలు: విమలక్క

నిజామాబాద్‌ కల్చరల్‌, జనవరి 6: ప్రపంచ తెలుగు మహాసభలతో తెలంగాణ భాష, సాహిత్యం, సంస్తృతికి ఎలాంటి ఉపయోగంలేదని ప్రముఖ రచయిత తిరుమలరావు అన్నారు. తెలంగాణ భాష, సాహితీ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు-ఒక విశ్లేషణ చర్చా గోష్టిలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆడంబరంగా నిర్వహించిన మహాసభల వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అయిందన్నారు.ప్రమఖ కవి అందెశ్రీ మాట్లాడుతూ.. త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళుతుందన్నారు. ప్రజా గాయని విమలక్క మాట్లాడుతూ జనుల సాహిత్యం, భాష, సంస్కృతులకు విలువ లేకుండా జాతరగా మహాసభలు నిర్వహించారని, దీనిని వ్యతిరేకిస్తున్నామన్నారు.