మాదాపూర్‌, జూన్‌1(ఆంధ్రజ్యోతి): కళాకారుల అభ్యున్నతికి  ప్రభుత్వం కృషిచేస్తోందని పర్యాటకశాఖమంత్రి అజ్మీరాచందూలాల్‌ అన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని స్టేట్‌ఆర్ట్‌గ్యాలరీలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శనను పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశంతో కలిసి మంత్రి ప్రారంభించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కళాకారులు, చిత్రకారులు తమదైన పాత్ర పోషించారన్నారు. అనంతరం బి.వెంకటేశం మాట్లాడుతూ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు.  ప్రదర్శనను మూడు కేటగిరీలుగా విభజించి మొదటి బహుమతిగా యూపీకి చెందిన మనీషకు రూ.లక్ష, రెండో బహుమతిగా తనీ్‌షఅక్తర్‌, రాజ్‌కుమార్‌ రూ.50వేలు, మూడో బహుమతిగా రూ.25వేల చెక్కులను అందజేశారు.  కార్యక్రమంలో సునీతభగత్‌, ఆర్ట్‌గ్యాలరీ డైరెక్టర్‌ కె.లక్ష్మి, సీనియర్‌ చిత్రకారుడు తోట వైకుంఠంతో పాటు సుమారు 150మంది చిత్రకారులు పాల్గొన్నారు.