చిక్కడపల్లి, అక్టోబర్‌3(ఆంధ్రజ్యోతి): ఉజ్వల దసరా పురస్కారాన్ని శివశక్తి నానీయాదవ్‌కు ప్రదానం చేశారు. ఉజ్వల, కురుగంటి కళాక్షేత్రం, త్యాగరాయగానసభల ఆధ్వర్యంలో బతుకమ్మ- దసరా దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గానసభలో పురస్కార ప్రదానం జరిగింది. గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మలు పురస్కారాన్ని నానీయాదవ్‌కు అందజేసి అభినందించారు. నిర్వాహకులు కె.రాధిక, ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శారద కళాక్షేత్ర కూచిపూడి డ్యాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ శిష్యబృందం ఆధ్వర్యంలో ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి.