చిక్కడపల్లి, డిసెంబర్‌3(ఆంధ్రజ్యోతి): వంశీ, ఘంటసాల ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌(గిఫ్ట్‌) ఆధ్వర్యంలో సోమవారం రాత్రి త్యాగరాయగానసభలోఘంటసాల ఆరాధనోత్సవాల సందర్భంగా ఆయన వారసురాలు వర్ధమాన నేపథ్యగాయని వీణా ఘంటసాలకు ఘంటసాల- వంశీ సంగీత పురస్కారం -2018 ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రముఖ నటి జమునారమణారావు ముఖ్యఅతిథిగా పాల్గొని పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఘంటసాల కృష్ణకుమారి రత్నకుమార్‌, అధ్యక్షత వహించారు. వంశీ సంస్థల అధినేత డా. వంశీ రామరాజు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో రచయిత్రి డా. తెన్నేటి సుధాదేవి, సుధామయి, గాయని విజయలక్ష్మి, అమెరికా రాగమయి, సురేఖామూర్తి తదితరులు పాల్గొన్నారు.