రవీంద్రభారతి(హైదరాబాద్), ఆగస్టు 16: తెలంగాణ వైతాళికుడు, మహాకవి వానమామలై వరదాచార్యులు  జయంతి వేడుకను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కవి సమయం, భారత్‌ కల్చరల్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన ఈ వేడుకల్లో వానమామలై వరదాచార్యులు స్మారక పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త డా.తిరునగరికి ప్రదానం చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత నాగబాల సురేష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులుగా ప్రముఖ సాహితీవేత్త తిరుమల శ్రీనివాసాచార్య, రిటైర్డ్‌ ఇంజనీర్‌ వానమామలై రవీంద్రచార్యులు, తుమ్మూరి రామ్మోహన్‌రావు, దైవజ్ఞశర్మ, ఉడయవర్లు, తాళ్లపల్లి మురళీధరగౌడ్‌, తూము శైలేష్‌కుమార్‌ తదితరులు పాల్గొని తిరునగరి దంపతులను ఘనంగా సత్కరించారు. వానమామలై వరదాచార్యులు కవిత్రయంలో ఒకరని అన్నారు. కావ్యం, వచన కవిత్వం, నాటకాలు వంటి సాహిత్యంలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి అని కీర్తించారు.