న్యూఢిల్లీ, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు తెలుగును తప్పనిసరిగా బోధించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణ యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు అభినందనలుచెప్పారు. చాలాకాలం నుంచి ఆశిస్తున్న ఈనిర్ణయం తెలుగువారికి సంతో షాన్ని కలిగిస్తుందన్నారు. హిందీ, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషలతో తెలుగు ప్రథమంగా ఉండాలని సూచించారు. ఏపీ సర్కార్‌ కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నానన్నారు. తెలుగు భాష వచ్చిన వారితో తెలుగులోనే మాట్లాడాలని, మాతృ భాషను వాడుక భాషగా ఉపయోగించు కోవడం మన కర్తవ్యమని పేర్కొన్నారు.