ఆంగ్లానువాదం ఆవిష్కరణ
భువనేశ్వర్‌, అక్టోబరు 4: విశ్వకవి సమ్మేళనం బుధవారం భువనేశ్వర్‌లో ప్రారంభమయ్యింది. కళింగ సంస్థల ఆధ్వర్యం లో ఐదు రోజులపాటు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రా రంభించారు. 82 దేశాలనుంచి 1300 మంది కవులు ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నా రు. ప్రపంచశాంతిదిశగా కవిత్వం పయనించాల్సినఅవసరాన్ని విశ్వకవి సమ్మేళనం చాటిచెబుతోందని వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ పొయెట్రీ అధ్యక్షుడు మారిస్‌ యంగ్‌ అన్నారు. తెలంగాణ కవి సిద్ధార్థ ఆంగ్ల కవితాసంపుటి ‘జాస్మిన్‌ వాటర్‌’ను కార్యక్రమ నిర్వాహకులు ఆవిష్కరించారు.