చిక్కడపల్లి, సెప్టెంబర్‌10(ఆంధ్రజ్యోతి): విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహితీ సార్వభౌముడు అని వక్తలు అన్నారు. ప్రముఖ సాహితీవేత్త విశ్వనాథ సత్యనారాయణ జయంతి సభ మంగళవారం త్యాగరాయగానసభలో గానసభ ఆధ్వర్యంలో  జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సాహితీవేత్త డా. వోలేటి పార్వతీశం విశ్వనాథ సత్యనారాయణ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం  మాట్లాడుతూ విశ్వనాథ సత్యనారాయణ అమృతసౌమ్యుడన్నారు. సభకు గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షత వహించారు.  ప్రముఖ కథారచయిత విహారి, దైవజ్ఞశర్మ,  కేవీ రావు, బాపిరాజు పాల్గొన్నారు.