చిక్కడపల్లి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ రాచర్ల నరసింహారావు రచించిన విశ్వప్రార్థన పుస్తకావిష్కరణ ఆదివారం రాత్రి త్యాగరాయగానసభలో శ్రీ రాచర్ల ధర్మసంస్థ ఆధ్వర్యంలో జరిగింది. సర్వార్థ సంక్షేమ సమితి అధ్యక్షుడు పీవీ మనోహరరావు మాట్లాడుతూ సుమారు 70 ఏండ్ల కిందట సమాజ శ్రేయస్సు కోసం నరసింహారావు భగవంతునికి చేసుకున్న విన్నపాలను విశ్వప్రార్థనగా ఆయన వారసులు గ్రంథం రూపంలో తీసుకురావడం విశేషమన్నారు. కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆంజనేయరాజు, వెంకటసూర్య సుబ్రహ్మణ్యం, కళా జనార్దనమూర్తి, కేశవులు, రామస్వామి పాల్గొన్నారు.