శ్రీకాకుళం(కృష్ణాజిల్లా), ఫిబ్రవరి 10: తెలుగుభాష పరిరక్షణకు కవులు, రచయితల ద్వారా మహోద్యమం సాగాలని, దీనికి తెలుగుభాషా సైన్యం తయారుకావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువు సన్నిధిలో శ్రీకృష్ణదేవరాయ మహోత్సవం-2018లో భాగంగా తెలుగు భాషా బ్రహ్మోత్సవాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ, తెలుగు.. భాష కాదనీ, సంస్కృతి అని తెలిపారు. మనిషి పుట్టిన తర్వాత భాష పుట్టినా మనిషికి నాగరికత, సంస్కృతి భాష నేర్పడం విశేషమన్నారు.వృత్తిరీత్యా ఆంగ్లభాషపై ఆధారపడవలసి వచ్చినా మాతృభాషను మరిచిపోనవసరం లేదని హితవు పలికారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఏడాదికి ఒక్కసారైనా భాషా సదస్సు నిర్వహించాలని సూచించారు. పిల్లలకు మాతృభాషలోనే ప్రాథమిక విద్య నేర్పించాలని, ప్రతిఇంటా పెద్దబాలశిక్ష ఉండాలని సూచించారు. సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ, తెలుగుభాష అతి ప్రాచీనమైందన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విశిష్టమైన భారతీయతను అగ్రపథాన నిలిపింది తెలుగు భాషేనని కొనియాడారు. భరతమాత సంతతిలో జ్యేష్ఠ సంతానం తెలుగేనని అభివర్ణించారు. ఏపీ సృజనాత్మకత, సాంస్కృతిక సమితి సీఈవో డాక్టర్‌ దీర్ఘాశి విజయభాస్కర్‌ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుభాషా ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. సభాధ్యక్షత వహించిన ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ, ఆంధ్రమహావిష్ణువు ఆదేశంతో శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద రచనకు శ్రీకాకుళంలో శ్రీకారం చుట్టినట్టు వివరించారు. తెలుగుకు వెలుగులు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోందన్నారు. మమ్మీ, డాడీ సంస్కృతి పోయి అమ్మా, నాన్నా సంస్కృతి రావాలని ఆకాంక్షించారు. కలెక్టర్‌ లక్ష్మీకాంతం, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌, రచయితలు పాల్గొన్నారు.

ఆందోళన కలిగిస్తోంది!

పూర్వ వైభవం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇచ్చాం. అయినా పరిస్థితులు అనుకూలించడం లేదు. కంప్యూటర్‌ కోర్సు ప్రవేశపెట్టినా విద్యార్థులు చేరకపోవడం ఆందోళన కలిగించే విషయం.

- స్వప్న హైందవి, ప్రిన్సిపాల్‌

నా కోర్సు అయిపోతుంది

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌ నెలల్లో జరిగే ఐదేళ్ల డిగ్రీ పరీక్షలు రాస్తే నా కోర్సు అయిపోతుంది. సంస్కృత విద్య ద్వారా ఉపాధి అవకాశాలున్నాయి. కంప్యూటర్‌ కోర్సు కూడా ప్రవేశపెట్టారు. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

- హీరా మేకల, విద్యార్థిని

 
అవకాశాలు మెండు
విజయనగరం సంస్కృత కళాశాలలో డిగ్రీ, ఏయూలో తెలుగులో పీజీ చేశాను. ప్రైవేట్‌ కళాశాలల్లో చేరాలని అవకాశాలు వస్తున్నాయి. ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాను.
- లక్ష్మణ్‌, పూర్వ విద్యార్థి