హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): తన ఐపీఎస్‌ విధుల్లో ఎప్పుడూ సంతోషంగా ఉంటూ ఇతరులను నవ్విస్తూ ఉండే భలేరావు రచించిన పుస్తకం ‘విత్‌ టంగ్‌ ఇన్‌ చీక్‌’ పుస్తకం పూర్తిగా సున్నితమైన హాస్యంతో నిండిఉంటుందని చీఫ్‌ సెక్రటరీ ఎస్‌కే జోషి అన్నారు. శనివారం మర్రి చెన్నారెడ్డి హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో పుస్తకావిష్కరణకు అతిఽథిగా పాల్గొన్నారు.  పుస్తకంలో హాస్యంతో నిండిన కఽథలున్నాయని, ఇవి అందరినీ ఆకట్టుకుంటాయన్నారు. పుస్తక రచయిత భలేరావు మాట్లాడుతూ తాను రిటైర్డ్‌ అయిన తరువాత ఇంట్లో ఏ పనీ సరిగా చేయక పోవడంతో తన భార్య సుప్రియ పుస్తకం రాయమని ప్రోత్సహించడంతో రచన ప్రారంభించానని తెలిపారు. తన నిజజీవితంలో జరిగిన సంఘటనలు కొన్ని, ఇతర అధికారులకు ఎదుర్కొన్న సంఘటనలు కొన్ని ఇందులో వివరించానన్నారు. ఎస్‌ఆర్‌ఎఎస్‌ ఫౌండేషన్‌ యూనిట్‌ బుక్‌లైన్‌ ద్వారా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. కార్యక్రమంలో ఎంసీహెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌, ఐఏఎస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బీపీ ఆచార్య, పలువురు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారులు, సర్వీసులో ఉన్న అధికారులు పాల్గొన్నారు.