యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ వెల్లడి

సిరిపురం(విశాఖ): తెలుగు భాషా సాహిత్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలనే ఆలోచనతో ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సులు నిర్వహిస్తున్నట్టు లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ విశాఖలో తెలిపారు. ఆరవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును ఆస్ర్టేలియా తెలుగు సంఘం, లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌, వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ హ్యూస్టస్‌ ఆమెరికా సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్‌ 3, 4 తేదీల్లో మెల్‌బోర్న్‌లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు.