పంజాగుట్ట, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత లియోటాల్‌స్టాయ్‌ రచించిన ‘వార్‌ అండ్‌ పీస్‌’ తెలుగు అనువాదం ‘యుద్ధం -శాంతి’ పుస్తకావిష్కరణ ఆదివారం రాత్రి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. సాహితీ పబ్లికేషన్స్‌ ముద్రించిన ఈ పుస్తకాన్ని ప్రముఖ కవి, రచయిత శివారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ టాల్‌స్టాయ్‌ అద్భుతంగా ఈ పుస్తకాన్ని రాశారన్నారు. కవి ప్రసాద్‌మూర్తి, రచయిత అజయ్‌ ప్రసాద్‌ పుస్తక సమీక్ష చేశారు. కార్యక్రమంలో కవి, విమర్శకులు లక్ష్మీ నరసయ్య, రచయితలు చంద్రశేఖర్‌, ఆజాద్‌, ముక్తవరం పార్థసారథి, కృష్ణమోహన్‌బాబు, వెంకట సిద్ధారెడ్డి, సురేష్‌, డి.మహీధర్‌, కూనపరాజుతో పాటు పలువురు పాల్గొన్నారు.